Photobucket

కోనమల్లేశ్వర కోన - వెంకటగిరి

Posted by Spurthi | | Category: |


కోనమల్లేశ్వర కోన :- వెంకటగిరికి పడమర దిక్కుగా 12కిలో మీ దూరములో వున్న వెలిగొండ కొండల నడుమ వెలసియున్నది.(ఇది మంచి పకృతి అందాల నిలయం)

ఈ కోనలో మంచి పకృతి ప్రసాదించిన జలపాతం వున్నది. ఈ జలపాతం సుమారు 80 అడుగుల పై నుంచి పడుతూ వుంటుంది. ఈ నీరు ఔషధగుణాలు పొందివున్నది ఎన్నో మలుపులతో ఎన్నో ఔషద సంబంధమైన చెట్లకు తాకుతూ వస్తూవుంటుంది కావున ఇక్కడ స్నానము చేయుట ఎంతో శ్రేష్ఠము.
ఈ కోన యందు ఉసిరి, బిక్కి, ఊటి, నేరేడు, లాంటి విరివిగా లభిస్తాయి. దేశంలోనే అరుదైన ఎర్రచందనం చెట్లతో నిండివుంటుంది. చాలా ఆహ్లాదకరమైన ప్రాంతము.
సుమారు 300 యేళ్ళ క్రితం నుంచి ఇక్కడ శివలింగము ఉన్నదని పూర్వీకులు కథనం. ఇక్కడకు కార్తీక మాసం లో భక్తుల సందర్శన ఎక్కువ గా వుంటుంది.
ఇక్కడకు ట్రాక్టరు, జీపుల ద్వారా వెళ్ళే సౌకర్యం కలదు.