Photobucket

వెంకటగిరి సంస్ధానములో ఖ్యాతి గడించిన మంత్రి

Posted by Spurthi | | Category: |


వెంకటగిరి సంస్ధానములో ఖ్యాతి గడించిన మంత్రి : శ్రీ ఖాన్ సా వలీ

1750 కాలంలో వెంకటగిరి సంస్థానము నందు ప్రధానమంత్రిగా తన కాలంలో ఎన్నో ఉపయుక్తమైన పనుల ద్వారా గొప్ప ఖ్యాతి గడించారు.
వెంకటగిరి నగరము పై తరచూ దాడులు చేస్తూ వెలిగొండలు లో వుండే పాలెగాళ్ళను తన చాకచక్యంతో తుదముట్టించారు.
వెంకటగిరి రాజ్యంపై టిప్పు సుల్తాన్ సైన్యం అప్పటి రాజా గారి కోటయైన పాతకోటను పూర్తిగా తుదముట్టించి పోయినారు, తరువాత కాలంలో మళ్ళీ బలపడిన వెంకటగిరి రాజ్యం పై తిరిగి వారు దండెత్తి రాగా ఖాన్ సావలీ గారు వారితో తన రాజనీతిని పదర్శించి సంధి చేసినారు.
నగర వీదులను విశాల పరచినారు, శివాలయం మరియు మసీదును ఖాన్ సావలీ కాలంలోనే నిర్మించడము జరిగినది.

ఈయన సమాధి లంగారు ఖాన్ తోట (గవర్నమెంట్ ఐ.టి.ఐ దగ్గర) నందు శ్రీ ఖాన్ సావలీ దర్గా గా విశేష ప్రజలు దీనిని సందర్శిస్తూవుంటారు. ప్రతి సంవత్సరము ఇక్కడ గంధోత్సవము వైభవముగా జరుగును