వెంకటగిరిలో ప్రభుత్వ చేనేత సహాకార సంఘము 1936వ సంవత్సరమున రిజిష్టరు చేయబడి 16-12-1938 సం చేనేత రంగము అభివృద్ధికి నాంది పలికి, ఆనాటి కాలంలో వెంకటగిరి చీర కళానైపుణ్యాన్ని దేశ వ్యాప్తం గావించింది.
ఈ సంస్థకు అనేక పర్యాయాలు ప్రెసిడెంట్ గా శ్రీ సుంకర రాధయ్య గారు, మరియు బోగా బాలాజి గార్ల హయంలో చాలా అభివృద్ధి చేశారు.
ఈ సంస్థ ద్వారా రాష్ర్టపతి అవార్డులు వచ్చాయి. శ్రీ గనకాల వెంకటేశ్వర్లు, చేనేత కళాకారుడు, 23-11-1983 అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ చేతుల మీద విశ్వకర్మ అవార్డును మరియు 2-4-1985 అప్పటి రాష్ర్టపతి జైల్ సింగ్ వారి చేతుల మీద నేషనల్ అవార్డును పొందారు.
1952వ సంవత్సరమున వెంకటగిరి రాజ సంస్థానము వారు ఈ సంస్థకు 22 ఎకరములు స్థలమును బహుకరీంచారు. 1983 లో చేనేత కార్మికులకు ఇవ్వడం జరిగినది.