రాచరికం:
వెంకటగిరి చరిత్ర కలిగిన ముఖ్య పట్టణము. మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. కుటుంబ రికార్డుల ప్రకారం, చెవిరెడ్డి అనే జమీందారు, తన పొలం దున్నుతుండగా 9లక్షల ఖజానా దొరికింది. ఈ ధనంతో, వరంగల్ రాజు యొద్దకు మార్గము సుగమమం చేసుకుని అతనిని ప్రసన్నం చేసుకొని వెంకటగిరి కోట అధికారాన్ని పొందగలిగాడు. ఇతని వారసులు వెంకటగిరి జమీందారులుగా వెలుగొందుతూ వచ్చారు. 1802 లో లార్డ్ క్లైవు కాలం లో 'సనద్' ను పొందారు. తమ వంశం జమీందార్లు 'రాజా' అనే బిరుదును వాడుతూ వచ్చారు.
మద్రాసు రాష్ట్రములో భాగమైన వెంకటగిరి సంస్థానమును వెలుగోటి వంశమునకు చెందిన వెలుగోటి రాయుడప్ప నాయని 1600లో స్థాపించెను. అతని వారసులు :
వెలుగోటి నిర్వాణ రాయప్ప (పెద్ద రాయుడు), 15వ రాజు (వెంకటగిరి), చికాకోల్ నవాబు షేర్ ముహమ్మద్ ఖాన్ 1652 లో రాజాం ఎస్టేటును వెలుగోటి నిర్వాణ రాయప్పకు బహూకరించి, చికాకోల్ కు ఇతని గౌరవార్థం 'బెబ్బులి' గా పేరు మార్చాడు. (తరువాత బొబ్బిలి గా రూపాంతరం చెందింది) 'రాజా' మరియు 'బహాదుర్' బిరుదులను ప్రదానం చేశాడు.
వెలుగోటి కుమార యాచమ నాయుడు (1777/1804) (జననం 23 ఫిబ్రవరి 1762)(మరణం 18 మార్చి 1804)
వెలుగోటి బంగారు యాచమ నాయుడు (1804/1847) (మరణం 25 డిసెంబరు 1847)
వెలుగోటి కుమార యాచమ నాయుడు (1848/1878) (జననం 3 జనవరి 1832, మరణం 1892.)
రాజగోపాల కృష్ణ యాచేంద్ర (qv)
రామకృష్ణ యాచేంద్ర, తరువాత శ్రీ రాజా రావు వెంకట సూర్య మహీపతి రామకృష్ణారావు బహదూర్ గా పేరుగాంచాడు. (పిఠాపురం 'రాజా' చే దత్తత తీసుకోబడ్డాడు).
రంగమన్నార్ కృష్ణ యాచేంద్ర, తరువాత మహారాజా వెంకట శ్వేతా చలపతి రంగా రావు గా పేరు గడించాడు, (బొబ్బిలి 'రాణి' చే దత్తత తీసుకోబడ్డాడు).
రాజా వేణుగోపాల్ బహదూర్, (జననం 12 ఫిబ్రవరి 1873) (జెట్టిప్రోలు కుటుంబంచే దత్తత తీసుకోబడ్డాడు).
రాజగోపాల కృష్ణ యాచేంద్ర (1878, జననం 1857)