వెంకటగిరి వివరాలు :
వెంకటగిరి, నెల్లూరు జిల్లాలోని ఒక చారిత్రక పట్టణము మరియు అదే పేరుగల మండలము. వెంకటగిరి పట్టుచీర లకు చాలా ప్రసిద్ధి చెందినది. జనాభా లెక్కల ప్రకారం 2001 నాటికి 48,341 మంది వున్నట్లు సమాచారం. వెంకటగిరి ఆక్ష్యరాస్యత 67%. ఇది దేశ అక్షరాస్యత కంటే 8% ఎక్కువ. వెంకటగిరి భౌగోళికాంశాలు, అక్షాంశ రేఖాంశాలు 13.9667° N 79.5833° E[1]. ఈ పట్టణమునకు దగ్గరలో రేణిగుంట వద్ధ తిరుపతి కి అంతర్జాతీయ విమానశ్రయాన్ని ఏర్పాటు చేస్తున్నారు.అంతేకాక ఇక్కడ అనేక పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు.
వెంకటగిరి పట్టణము నేత చీరలకు మరియు పోలేరమ్మ జాతరకు చాలా ప్రసిద్ధి. ఈ ముఖ్య పట్టణము లోని ప్రజలు ప్రతి సంవత్సరం పోలేరమ్మ జాతర చాలా భక్తి శ్రద్ధలతో వైభావం గా జరుపుకుందురు. ఈ జాతర ప్రతి సంవత్సరం వినాయక చవితి తరువాతి 3వ బుధవారం మరియు గురువారం న జరుపుకుంటారు.