Photobucket

లలిత కళలలో ఓ కొత్త ఒరవడి - గేయధార

Posted by Spurthi | | Category: |


గేయధార : సృష్ఠికర్త డా. శ్రీ భాస్కర సాయి క్రష్ణ యాచేంద్ర గారు ( రాజ వంశీయులు) మాజీ ఎమెల్యే ( వెంకటగిరి)
గేయధార గురించి క్లుప్తంగా : ప్రశ్నలకు సంగీత, సాహిత్య లతో కట్టుబడి సమాధానమిస్తూ, పద నిషేదాన్ని పాటిస్తూ ఇష్టపద ప్రయోగానికి కట్టుబడి చేసే ప్రక్రియే గేయధార.
గేయధార జరిగే విధానం :- 1) వస్తు నిర్ధేశకులు -2, 2) రాగ, తాళ నిర్ధేశకులు 3) మంచి ముచ్చట్ల నిర్ధేశకులు 4) పల్లవి పూరణ నిర్ధేశకులు 5) పద నిషేదకులు 6) ఇష్ట పద ప్రయోగకులు మొత్తం కలిపి 7 మంది పృచ్చకులు వుంటారు. గేయధార బ్రహ్మ గేయధారతో పూరిస్తారు.
గేయధార వివరణ :- వస్తు నిర్ధేశకులు అడిగిన అంశము పై గేయం ఏ రాగ తాళలలో వుండాలో, రాగ తాళ నిర్ధేశకులు సూచిస్తారు. గేయమును అశువుగా ఆలపిస్తుండగా మధ్యలో ఒక ప్రుచ్చికుడు ముచ్చట్లు మొదలెడుతాడు మధ్యలో అసందర్భమైన ప్రశ్నలు వేస్తారు, పల్లవి పూరణంలో ప్రుచ్చికుడు ఇచ్చిన పల్లవికి చరణాలను ఫూరించాలి, పద నిషేదంలో ప్రుచ్చికుడు అంశములో కొన్ని పదాలను నిషేదిస్తూ వుంటాడు,
గేయధార
ఒక గేయధార సభలో జరిగిన గేయధారలో ఇష్ట పద అంశములు : పృచ్చకుడు కోరినవి
కుంటి, మూగ, చెవుడు పదాలతో ఒక అందమైన ప్రేయసిని వర్ణించమని కోరగా
యాచేంద్రగారు ఇలా :-
అందాల ఊర్వశీ అనురాగ ప్రేయసీ మనుసులోన దాచుకుంటి
అనురాగవారసి వలపులు మూగగా
తలపులు రేగగా ప్రేమ సుధా చంద్రికలే కురిపించెవుడుపతి
నాడు ఇరువరము పాడుకున్న విరహ గీతిక పలకబోదిక
ప్రణయ సారిక అంటూ ముగించారు.

ఇప్పటి వరకు సుమారుగా 340 గేయధార కచ్చేరీలను చేశారు డా. శ్రీ భాస్కర సాయి క్రష్ణ యాచేంద్ర గారు.
200వ గేయధార వివరాలు
ముఖ్య అతిధి గా : శ్రీమతి సుశీల గారు విచ్చేశారు.
పృచ్చకుడు ( అనగా ప్రశ్నలు అడిగేవారు ) ఇరాక్, ఇటలీ, చైనా, జపాన్ దేశాల పేర్లు వస్తూ కృష్ణుడిపై జావళి ఇవ్వమని కోరగా
అందుకు యాచేంద్ర గారు ఇలా ,
పొద్దుపోఇరాకురా
ముద్దుల కృష్ణ హద్దులేని విరహమును ఆపలనేరురా
ఇటలీలు సాగించి ఎద వీణను రవళించి మరుకేళిని తేలించే మదన గోపాలా
మంచైనా చెడు అయినా భారము నీదేనని మనసర్పించిన నిత్యజపానుశీలనరా
అని ముగించారు.
300వ గేయధార
చెన్నై, వాణీ మహోల్ వైభవంగా జరిగిన ఈ గేయధారకు విచ్చేసిన ముఖ్య అతిధిలు : శ్రీ సింగితం శ్రీనివాసరావు గారు, శ్రీమతి సుశీల గారు, శ్రీ సాలూరు వాసురావు గారు , శ్రీ అప్పలరాజు గారు, శ్రీ గొల్లపూడి మారుతీ రావుగారు మరియు సిక్కిం గవర్నర్ రామారావు, ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరా దత్తు గారు,
పృచ్చకవర్యులు : శ్రీ బి.వి నరసింహ రావు గారు, క్రికెట్ ఆటకు సంబంధించి బౌలర్, వికెట్టు , స్టంప్, విన్నర్ పదాలతో రాధా కృష్ణుల ప్రణయాన్ని వర్ణించమని కోరగా