Photobucket

శ్రీ కె.సి రావు కళాపీఠం

Posted by Spurthi | | Category: |


ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా వెంకటగిరి చెందిన కీ.శే శ్రీ కె.సి.రావు గారు(కొమ్మూరు. చెంచేశ్వరరావు), 1942 సం. సెప్టంబర్ 4న వెంకటగిరి లో శ్రీ కొమ్మూరు పోలయ్య శ్రీమతి వెంకటమ్మ దంపతుల తొలి సంతానం జన్మించారు. తల్లి తండ్రులు చెంచుఓబులు అని నామకరణం చేశారు రంగస్థలం పై కె.సి రావు గా ( చెంచేశ్వరరావు గా) రాణించారు. అతను బాల్యం నుంచే వీధినాటకాలు, వీధి భాగవతాలు చూచి ఆనాటి నుండి నటన పై మక్కువ పెంచుకున్నారు. అప్పటి లో వారి గురువుగారు కీ.శే. శ్రీ వంట నారాయణ బాబు గారి శిష్యులుగా నటన లో రాణించారు, పౌరాణిక, సాంఘిక నాటకాలలో రాష్ట్రనలుమూలలో వేల ప్రదర్శనలిచ్చారు. పౌరాణికాలలో ధుర్యోదననుని పాత్రలలో అభినవ రారాజుగా ప్రశంసలందుకున్నారు. చాణుక్య పాత్రలో అపర చాణుక్య అనిపించుకున్నారు. మాయల ఫకీరు విశ్వామిత్ర రావణ బ్రహ్మగా తదితర పాత్రలు పోషించారు.
కురుక్షేత్రం, రామాంజనేయుద్దం, హరిచ్చంద్ర, తారాశశాంకం, బాల నాగమ్మ వంటి పౌరాణికాలలోను నటనాలయం కీర్తి శేషులు, ఈ జనానికో దండం, రాజీవం తదితర సాంఘీక నాటకాలలో నటించారు. 1) శృంగారము సంగుతో మాయల మరాఠి, 2) హాస్యం :- శ్రీనివాస కళ్యాణం లో దిబ్బన్న, అక్షరాస్మి లో బ్రహ్మాణ పాత్ర 3) కరుణ :- న్యాయం చట్టంలో కొండడు పాత్ర 4) రౌద్రం :- దుర్యోధన ఆవేదన 5) వీర :- పల్నాటి బాల చంద్రుడు 6) భయానకం :- చంద్రగుప్త చాణుక్య 7) బీభత్సం :- మాయఫకీరు పూజా మందిరం 8) అద్భుతం :- ధుర్యోధన మయ సభ 9) శాంతరసం :- వీర బాహుడు అలా నవరసాలు అవలీలగా నటించేవారు.
విజయవాడ, తిరుపతి, శ్రీకాళహస్తి, కోడూరు, బుచ్చిరెడ్డిపాళెం, కడప, హైదరాబాదు తదితర పట్టణాలలో పలు పోటి ప్రదర్శనలలో పాల్గొని బహుమతులు పొందారు.
ప్రభుత్వము చే నెల్లూరు జిల్లాలో సాక్ష్యరతా సమితి నిర్వహించిన అక్షరకళాయాత్రలో (1991సం) జిల్లా కేంద్రములో ఉన్నం భసవయ్య, ఆధ్వర్యములో శ్రీ కె.సి రావు శిక్షణ పొంది, వెంకటగిరి మండలంలో శ్రీ కె.సి రావు అక్షరకళా యాత్ర నాట్య మండలి డైరెక్టరు గా మరియు ఆర్గనైజర్ గాను నటులు గాను మండలంలో అక్షరాస్యతా విలువలను చాటిచెప్పే కళాప్రదర్శనలిచ్చారు. సంఘసేవకుడుగా దోహదపడ్డారు.
విధ్యార్ధులను చైతన్య పరిచే దిశగా పలు విద్యాసంస్థలలో కళా ప్రదర్శనలిచ్చారు. ప్రముఖ నటులు శ్రీ పృద్వి వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి గూడూరు సావిత్రి గారు, శ్రీ చెన్నూరు చెంచల రావు తదితర ప్రముఖులతో సహనటులుగా నటించారు.
ప్రముఖ సినీ కహాస్యనటులు శ్రీ పద్మనాభం, శ్రీమతి రమాప్రభ గార్ల చేతులు మీద పోటి బహుమతులు అందుకున్నారు.
అలనాడు వెంకటగిరికి విచ్చేసిన మనుసుకవి శ్రీ ఆచార్య ఆత్రేయ గారు, శ్రీ యం.యస్. రెడ్డి గార్లు వెంకటగిరి శ్రీ కె.సి రావు గారి నటన చూచి ‘‘ పిట్ట కొంచెం కూత¬ ఘనం’’ అని ప్రశంసించారు.
వెంకటగిరి రాజా వంశీయులు సంగీత గేయధార స్రష్ఠ శ్రీ డా. సాయికృష్ణయాచేంద్ర గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ డా. శివప్రసాద్ గారి నుంచి వెంకటగిరిలో నటసమాఖ్య వేదిక పై సన్మానం అందుకున్నారు.
1992 ఆగష్టు 15న విశ్వోదయా కళాశాలలో శ్రీ సాయి కృష్ణయాచేంద్ర వారి చేతుల మీద సత్కారం అందుకొని ‘‘కళాతపస్వి’’ బిరుదును పొందారు.
వెంకటగిరి నటసమాఖ్య వ్యవస్థపాక సభ్యలు శ్రీ కె.సి రావు గారు
బాల్యంలో వ్యాయమకారుడుగా దేహదారుడ్యం కల్గిన వ్యక్తి గనుక గాంభీరమైన ప్రతినాయక పాత్రలు పోషించారు. ఆయన హార్ట్ ఎనలార్జ్ సమస్య వున్నా కళామతల్లి పై వున్న భక్తితో రంగస్థలం పై ప్రాణం పోయినా ఫరవాలేదని నటించారు.
వెంకటగిరి లో శ్రీ కె.సి రావు గారు 1991 మార్చి 21న స్వర్గస్తులైనారు.

1996 నుంచి శ్రీ కె.సి రావు స్మారక కళోత్సవాలు ప్రతి సంవత్సరం వెంకటగిరిలో జరుగుచున్నవి. ఈ కళోత్సవాలలో రాష్ర్టస్థాయి ఏకపాత్రాభినయ పోటీలు మరియు జానపద నృత్య పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ పోటిలలో విజేతలకు నగదు బహుమతులు మరియు షీల్డు బహుకరిస్తున్నారు. ఈ వేదిక పై రంగస్థల సీనియర్ కళాకారులకు శ్రీ కె.సి రావు గారి అవార్డును బహుకరిస్తూ సత్కరిస్తున్నారు.
కళాకారులను సత్కరించుకోవడం కళారాధనగా భాగమే.
ఈ శ్రీ కె.సి రావు గారి స్మారక కళోత్సవాల సంస్థను వారి గురువు గారు శ్రీ వంటా నారాయణ బాబు గారు సలహా మేరకు శ్రీ కె.సి రావు గారి తనయుడు శ్రీ కె.సి కృష్ణ నిర్వహిస్తున్నారు. అతను రంగస్థల నటులే నట రాజు ఆశ్శీస్సులతో కళారాధనలో భాగంగా ప్రతి సంవత్సరం తండ్రి గారి పేరున వెంకటగిరిలో శ్రీ కె.సిరావు గారి స్మారక కళోత్సవాలు, నృత్యం మరియు పౌరాణిక ప్రదర్శనల పోటీలు నిర్వహించడం కళారాధనలో భాగంగా భావించి నటసమాఖ్య పెద్దల సూచన మేరకు ఈ కళోత్సవాల కన్వీనర్ గా శ్రీ కె.సి కృష్ణ తన సొంత ఖర్చులతో నిర్వహిస్తున్నారు.
రంగస్థల కళాకారులుగా వేదిక పై శ్రీ కె.సి రావు గారు పలువురు ప్రశంసలు, సత్కారాలు అందుకున్నారు. వారి తదనంతరం ఆ రంగంలో ప్రశంసలందుకున్న శ్రీ కె.సి రావు స్మారక కళోత్సవంలో బాగంగా కళాకారులను సత్కరించుకోవడం కళామతల్లి సేవ చేసుకోవడం అంటున్నారు. శ్రీ కె.సి కృష్ణ.

కళలు దైవ స్వరూపాలు - కళారాధాన దైవారాధన
శ్రీ కె.సి కృష్ణ,
శ్రీ కె.సి రావు కళాపీఠం , కన్వీనర్,
13-353, కాశీపేట – వెంకటగిరి, నెల్లూరు జిల్లా , ఎ.పి. సెల్ : 9441394591


శ్రీ కె.సి కృష్ణ