Photobucket

శ్రీ శ్రీ కాశీనాధుని దేవాలయం - వెంకటగిరి

Posted by Spurthi | | Category: |


1760 సం.న శ్రీ బంగారు యాచమనాయుడు, వెంకటగిరి సంస్థానాధీశులు, దీనిని నిర్మించి, విక్రమ నామ సంవత్సర జేష్ఠ పౌర్ణమి నాడు దీనిని ప్రారంభించినారు,
రాజావారు ఈ దేవాలయము నిర్మించటకు గల కారణము : ఒక నాటి రాత్రి స్వప్నము నందు పరమ శివుడు ప్రత్యక్షమై కాశీ నుంచి నా మూర్తిని నా భక్తుడు నీకు అందించును అని చెప్పెను. అప్పటి నుంచి రాజా వారు ఈ విషయమై విచారించుంచూ కాశీ మార్గమున కొంత మంది సిబ్బందిని వుంచెను. వారి ద్వారా ఒక బ్రాహ్మణుడు కావడిలో శివలింగము తీసుకొన రావడం తెలిసి తన పరివారముతో సహా ఎదురు వెళ్ళి తనకు స్వప్నము నిజమైనందుకు సంతోషించి ఆ బ్రహ్మణుడిని సత్కరించిన తరువాత వెంకటగిరి కైవాల్య నదీ తీరమున విగ్రహ ప్రతిష్ఠ గావించెను. అటు తరువాత ఆ దేవాలయమునకు అతి పెద్ద ప్రహరీ, ప్రవేశ ద్వారము మరియు 82 అడుగు గాలి గోపురము కట్టించెను. గోపురము పై వున్న గొప్ప కళా నైపుణ్యము చోళుల సంస్కృతిని ప్రతి బింబిస్తుంది.
దేవాలయ ప్రకారము లోపల వినాయక మందిరము మరియు పాతాళ వినాయకుడు, వళ్ళీదేవసేనా సమేతుడగు కుమార స్వామిని వారి గుడులను నిర్మించిరి. శ్రీ బంగారు యాచమనాయుడు కుమారుడు శ్రీ కుమార యాచమనాయుడు తన తండ్రిగారి పేరున స్వర్ణేశుడు అను లింగమును ప్రతిష్ఠించెను. 64 అడుగుల ఏక శిలా ద్వజ స్థంభమును దేవాలయమునకు మకుటాయమాయంగా నిలిపెను. అన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాథునకు విడివిడిగా మరియు ఇతర దేవతలకు అత్యంత విలువైన రధములను బంగారు నంది వాహనము దేవతా మూర్తులకు విలువైన బంగారు ఆభరణములు చేయించి మరి కొన్ని గ్రామములను దత్తతు ఇచ్చి మరింత అభివృద్ధి చేసెను. ఈనాటి కి దక్షిణాది ఆలయ ప్రసిద్ధిగాంచినది.