మల్లమ్మ దేవాలయం
సాధారణ కర్ణసాలీ కుటుంబ స్ర్తీ , భర్తతో సతీసగమనం చేసి దేవతా మూర్తిగా ఆవర్భవించినది వెంకటగిరి మల్లమ్మ.
మధ్యతరగతి చేనేత కుటుంబంలో గురవయ్య, మంగమ్మ దంపతులకు ఆరవ సంతానము జన్మించినది మల్లమ్మ
రంగయ్య శెట్టి తో వివాహ జీవితమును పలువురు మెచ్చే విధంగా సాగుతున్న మల్లమ్మ జీవితంలో దాన ధర్మాలు, నిత్య అన్నదానలు భాగంగా వుండేవి. ఆ దంపతులను పుణ్యదంపతులుగా ఖ్యాతి గడించారు. వీరి మంచితనము వారి ఆస్థులను కరిగించి అప్పులను చేర్చాయి. అప్పులు వారి స్థిర చరాస్తులను వారికి దూరం చేశాయి. వారు మగ్గం నేస్తూ జీవనాన్ని గడపుతున్న సమయంలో హఠాత్తు పరిణామం గా భర్తకు టి.బి సోకి జీవన స్థితి దయనీయ స్థితికి చేరగా తన సంతానము పుట్టింటికి పంపివేసి, తోబుట్టువుల దగ్గరకు భర్తతో వెళ్ళడం తో అక్కడ మనస్థాపమే మిగిలింది. ఆత్మాభిమానము గల మల్లమ్మ తిరిగి మెట్టిల్లు ( వెంకటగిరి ) చేరుకొని, తన రెక్కల కష్టమును భర్త వ్యాధి నయం కోసం వెచ్చిచింది, ఒకనాడు తన భర్త విందు భోజనము కోరగా తన మంగళసూత్రము తెగనమ్మి విందుభోజనము తయారు చేసింది విందు భోజనము చేయచూ వ్యాధితో భర్త మధ్యలోనే మరణించారు. ఆ ఎడబాటును తాళలేని మల్లమ్మ సతీసగమనం చేయడానికే నిర్ణయించుకుంది. ( అప్పటికి సతీసహగమనం నిషేధం చట్టం అమలులో వుంది) రాజావారి అనుమతి కోసం ప్రయత్నం చేయగా వారు కాశీ యాత్రలో వున్నందున వెంటనే అద్రశ్యమై, మరుసటి దినమున రాజావారి అనుమతి పత్రముతో రాజ ప్రతినిథుల యొదుట ప్రత్యం కాగా ఆశ్చర్యచకితులై వారు రుజువు కోరగా ఆమె తన ప్రాతివత్యం మహిమను కళ్ళారా చూపి తన చనిపోయిన భర్తను మాట్లాడిస్తుంది మల్లమ్మ.
రాజ ప్రతినిధులు సతీసగమమునకు ఆమెకు అనుమతినిచ్చిరి ఆ ప్రాంతములో అగ్నిగుండము ఏర్పాటు చేయగా అందులో మల్లమ్మ సతీసహగమనము తో తనువు చాలించినది. కావున ఆ ప్రదేశములో ఆమెకు గుడి ఏర్పాటు నిర్మించినారు. ఆ ప్రాంతము మల్లమ్మ గుడి వీధిగా వున్నది. ఇప్పటికీ ఆమె వెంకటగిరి ప్రజల ఆరాధ్య దేవతాగా పూజలందుకుంటూ వుంది.