Photobucket

Poleramma Jathara

Posted by Spurthi | | Category: |






వెంకటగిరి,మేజర్‌న్యూస్‌:జగతిని జాగృత్వం చేసి, ప్రగతికి మార్గం చూపేదే మహిళ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు, ప్రగతిశీల భావాలు వర్ధిల్లిన కాలం సింధూ నాగరికధ కాలం. ప్రపంచ నాగరికత దేశాలతో పోటీ పడి సాంకేతిక, వైజ్ఞానిక ప్రగతితోపాటు పట్టణ నాగరికతను విశిష్టంగా కలిగిందే సింధు నాగరికత. ఇది మాతృస్వామిక దేశం. మహిళ అన్న పథానికి ‘ మహిళా భూమి ’ అని చెప్పడం జరిగింది. మహిళ అనే పదము మహి మరియు ఇలా అనే రెండు పదాల కలయికతో ఏర్పడింది. మహీ అంటే స్ర్తీ అని, ఇలా అంటే భూమి అని వెరసి దా ల్యాండ్‌ ఆఫ్‌ ఉమెన్‌ అని స్పురింప చేస్తున్నది.




మాతృస్వామిక వ్యవస్ధకు చెందిన నేటి గ్రామ దేవతలు దళిత బహుజన సంస్కృతి ప్రతి బింభాలుగా చరిత్ర చెపుతున్నది. సమాజంలోని అధిక సంఖ్యాకులు భానిసత్వంలో మగ్గేలా చేయడం, వారి శ్రమను దోపిడి చేయడం వంటివి ఈ గ్రామ దేవతలకు తెలియదు. జనానికి సామాన్య, సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో, ఉత్పత్తిలో వారు ఉత్సాహంగా పాలుపంచుకునేలా చేయడం ఈ గ్రామదేవతల ప్రధాన విధి. అటువంటి గ్రామదేవతలలో ఒకరు గ్రామశక్తి పోలేరమ్మ. ఈమెను తెలంగాణాలో పోచమ్మగాను, కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పోలేరమ్మగాను జనులు పిలుస్తున్నారు