ఐ యన్ యస్ – “అరిహంత్” భారతదేశపు మొట్టమొదటి అణు జలాంతర్గామి. ”అరిహంత్” విశాఖపట్నం వద్ద తయారు చెయ్యబడింది.
“అరి” అంటే శత్రువు “హంత్” అంటే మట్టు పెట్టడం.మన సముద్ర మార్గం ద్వారా చొచ్చుకుని వచ్చే శత్రువులను మట్టు పెట్టడం కోసం అరిహంత్ తయారు చెయ్యబడింది.
26 జూలై,2009 నాడు మన భారత ప్రధాని శ్రీ మన్మోహన్ సింగ్ మరియు ఆయన సతీమణి గురుశరణ్ కౌర్ “అరిహంత్” ను భారత నౌకా దళానికి అందజేసారు.
ఇది నిత్యం భారత సముద్ర జలాలలో శత్రు నౌకల ఆచూకీ కనిపెట్టడానికి భారత నౌకా దళం ద్వారా ఉపయోగించబడడానికి సిద్ధమైంది.ఇది ballistic శ్రేణి కి చెందిన జలాంతర్గామి. Advanced Technology vessel (ATV) project లో భాగం గా దీన్ని తయారు చెయ్యడం జరిగింది.
ఇది దాదాపుగా 6000 టన్నుల బరువు కలిగి ఉంది.తన లోని Nuclear reactor ద్వారా అరిహంత్ తనకు అవసరమైన ఇంధనాన్ని మరియు శక్తిసామర్ధ్యాలని సముపార్జించుకుంటుంది.
అణు జలాంతర్గాములు సాధారణ జలాంతర్గాముల కన్నా ఎక్కువ శక్తి సామర్ధ్యాల్ని కలిగి ఉంటాయి. Nuclear propulsion technique లో కేంద్రక విచ్ఛిత్తి ద్వారా ఉత్పత్తి ఐన ఆణు విద్యుత్ తో నడిచే 80 మెగావాట్ల propulsion turbines ఉపయోగించి అరిహంత్ నీటి అడుగున ప్రయాణిస్తుంది.
అరిహంత్ కు నీటి అడుగునించి నేల మీదకు ballistic క్షిపణులను సంధించగలిగే సామర్ధ్యం ఉంది.ఈ ballistic క్షిపణులను ప్రయోగించడం ద్వారా భూమిపై ఉన్న శత్రు స్థావరాలను కూడా ధ్వంసం చెయ్యవచ్చు.
సాధారణ జలాంతర్గాములకు ఇంధనం అవసరమైనప్పుడల్లా అవి సముద్ర ఉపరితలం మీదకు రావలసి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో శత్రు గూఢచారులకు మన జలాంతర్గాములను కనిపెట్టే అవకాశం ఉంటుంది.
కానీ అరిహంత్ శ్రేణి జలాంతర్గాములు ఎక్కువ సామర్ధ్యం తో పని చేస్తాయి కాబట్టి శత్రువులకు కనిపించకుండా చాలా రోజులు నీటిలోనే ఉండగలవు.వీటికి ఇంధనం నింపుకోవడానికి సముద్ర ఉపరితలం మీదకు రావలసిన అవసరం చాలా తక్కువగా ఉంటుంది. వీటిలోని ఇంకొక విశేషం ఏమిటంటే ఇవి తక్కువ శబ్దం తో ప్రయాణిస్తాయి. కాబట్టి శత్రువుల radarలకు చిక్కే అవకాశం చాలా తక్కువ. ఇవి sonar పద్ధతిలో శబ్ద తరంగాలను ఉపయోగించి సముద్రం లోని దూరాలను లెక్క కడతాయి.
అరిహంత్ లో 100 మంది సైనికులకి సరిపడా వనరులున్నాయి.రెండేళ్ళ పాటు ప్రయోగదశను పుర్తి చేసుకున్న తరువాత అరిహంత్ భారత నౌకాదళం నుంచి తన సేవలను భారత దేశానికి అందించనుంది.
అణు జలాంతర్గామి అరిహంత్, ఒకప్పటి సోవియట్ యూనియన్ నుంచి 1987లో లీజుకు తీసుకున్న ఛార్లీ తరగతికి చెందినది. దేశ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసెల్ (ఎటివి) ప్రోగ్రామ్ కింద దీన్ని నిర్మించారు. ఇందులో అమర్చిన అణు రియాక్టర్‌ను తమిళనాడురాష్ట్రం కల్పకంలోని ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటమిక్ రీసెర్చ్ సెంటర్‌లో తయారుచేశారు. ఈ జలాంతర్గామికి 'అస్త్ర' అని పేరు పెట్టాలని భావించినా, చివరికి 'అరిహంత్'గా నామకరణం చేశారు. దీంతోపాటు రష్యా నుంచి లీజుకు తీసుకుంటున్న అకుల-2 క్లాస్‌కు చెందిన అణు జలాంతర్గామికి చక్రగా నామకరణం చేశారు. ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్రంలో సముద్ర పరీక్షలు జరుపుకుంటున్న ఈ జలాంతర్గామి ఈ ఏడాది చివరలోగానీ, వచ్చే ఏడాదిగానీ మన దేశానికి రానుంది. ఈ జలాంతర్గామి కూడా విశాఖ కేంద్రంగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
