విండోస్ రిజిస్ట్రీ ద్వారా మన హార్డ్ డిస్క్ లోని C, D, E వంటి వేర్వేరు డిస్క్ డ్రైవ్ లను ఇతరులకు కనిపించకుండా ఎలా చేయాలో చూద్దాం. మీకంప్యూటర్లో Start మెనూలో Run కమాండ్ బాక్స్ లో diskpart అనే కమాండ్‍ని టైప్ చేయండి. వెంటనే కమాండ్ ప్రాంప్ట్ వద్ద DISKPART> అని వస్తుంది. అక్కడ list volume అనే కమాండ్ టైప్ చేస్తే క్రింది విధంగా స్క్రీన్ వస్తుంది. D డ్రైవ్‍ని హైడ్ చేయాలనుకుంటే select volume # అనే కమాండ్‍ని టైప్ చేసి , వెంటనే remove letter D అని టైప్ చేయండి. దాంతో డ్రైవ్ లెటర్ తొలగిపోతుంది. మళ్ళీ ఆ డ్రైవ్ రావాలంటే పై క్రమంలోనే కమాండ్లని టైప్ చేసి remove letter D వద్ద assign letter D అనే కమాండ్‍ని ఉపయోగించుకోవలసి ఉంటుంది.
