Photobucket

వెంకటగిరి విశ్వోదయా కళాశాల స్థాపన

Posted by Spurthi | | Category: |


శ్రీ జూపల్లి నరశింహారావు, గారు వెంకటగిరి వాస్తవ్యులు, కావలిలోని విశ్వోదయా కళాశాల నందు ఇంగ్లీషు లెక్చరర్ గా వుంటున్న సమయంలో తన స్వస్థములో విద్యా అబివృద్ధి కావలెననే తపనతో తన తోటి మిత్రులైన శ్రీ మాకాణి వెంకటస్వామి , శ్రీ హరిదాసు శ్రీనివాసులు గార్ల సహకారంతో ఎడ్యకేషనల్ సర్వీస్ సొసైటీ ( ఇ.యస్.యస్ ) ను రూపొందించారు. కొన్నినాళ్ళకే ఈ సొసైటీ 27 మంది కార్యవర్గముగా రూపొంది.
మొట్టమెదటగా 1967 సంవత్సరము జూలై నెల వెంకటగిరి నందు ఉన్నత విద్యకు అంకురార్పణ గావించారు. అప్పటి యం.యల్.ఎ శ్రీ పాదిలేటి వెంకటస్వామి రెడ్డి స్థలమును గ్రాంటు చేయించి ప్రారంభించినారు.
ఈ కళాశాలకు విశ్వోదయా అనే పేరును పెట్టారు.
మొట్టమెదటి ప్రిన్సిపల్ గా : శ్రీ చలపతి రావు గారు పనిచేశారు.
ఈ కళాశాల ఎందరికో విద్యాజీవితాన్ని ఉన్నత రంగాలను ప్రాసాదించింది.
వెంకటగిరి విద్యా చరిత్రలో చిరస్మరణీయుడు : శ్రీ జూపల్లి నరశింహారావు గారు